Home జాతీయం ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఖరారు | PM Modi Visit US From September 21-23 To Attend 4th Quad Summit

ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఖరారు | PM Modi Visit US From September 21-23 To Attend 4th Quad Summit

0
ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఖరారు | PM Modi Visit US From September 21-23 To Attend 4th Quad Summit

 

Nsnnews// ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ఖరారైంది. ఈనెల 21 నుంచి 23 వరకు అగ్రరాజ్యంలో ప్రధాని మోదీ పర్యటించనున్నట్టు భారత విదేశాంగశాఖ వెల్లడించింది. సెప్టెంబరు 21న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలో విల్మింగ్టన్ వేదికగా నిర్వహించనున్న నాలుగో “క్వాడ్ ” సదస్సులో మోదీ పాల్గొననున్నారని తెలిపింది. సెప్టెంబరు 22న న్యూయార్క్ లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి.. మోదీ ప్రసంగిస్తారని పేర్కొంది. కృత్రిమ మేధ, బయోటెక్నాలజీ, సెమీకండక్టర్లు తదితర రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు.. ప్రముఖ సంస్థల సీఈవోలతో మోదీ భేటీ అవుతారని తెలిపింది. భారత్ – అమెరికా సంబంధాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రముఖులతోనూ సంభాషించనున్నారని వెల్లడించింది. సెప్టెంబరు 23న న్యూయార్క్ లోని uno ప్రధాన కార్యాలయంలో.. “సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ “ను ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తారని తెలిపింది. ఈ సందర్భంగా అనేక మంది ప్రపంచ నేతలతో.. ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని విదేశాంగశాఖ పేర్కొంది.

Latest news,Telugu news,National news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here