Nsnnews// గత ఐదేళ్లలో పంట రుణం తీసుకున్న…ప్రతి రైతు రుణమాఫీ చేసే బాధ్యత ప్రభుత్వానిదని..వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు స్పష్టంచేశారు. రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాగానే రైతు భరోసా నిధులు వేస్తామని ఆయన వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీకి… తెలంగాణలో18వేల కోట్ల రుణమాఫీ కనిపించడంలేదా అని మంత్రి ప్రశ్నించారు. గాంధీభవన్ లో ప్రజల ముఖాముఖి కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ముఖాముఖి కార్యక్రమానికి తరలివచ్చిన…. కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజల నుంచి 95 అర్జీలు స్వీకరించారు. కొన్ని సమస్యలను..కలెక్టర్లతో మాట్లాడి పరిష్కరించినట్టు తెలిపారు. రుణమాఫీపై విపక్షాల ఆరోపణలను మంత్రి తిప్పికొట్టారు. అధికారం కోల్పోయిన బాధ ఒకరిదైతే….అధికారంలోకి రావాలనే బాధ ఇంకోకరిదని మంత్రి తుమ్మల ఎద్దేవా చేశారు.
Latest news,Telugu news,Telangana news