Home పాలిటిక్స్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ప్రత్యేక వేదిక: చంద్రబాబు

ప్రజా సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ప్రత్యేక వేదిక: చంద్రబాబు

0
ప్రజా సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ప్రత్యేక వేదిక: చంద్రబాబు

 

Nsnnews//AP  అమరావతి: ప్రజా సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తానని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్తానని ఇటీవల హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఎన్టీఆర్‌ భవన్‌కు వెళ్లారు. అక్కడే ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ప్రజల వినతులు చూస్తుంటే గత ఐదేళ్లలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలుస్తోందని వ్యాఖ్యానించారు. 
గత ప్రభుత్వం సరిగా పనిచేయకపోవడం వల్లే ప్రజలకు ఇన్ని సమస్యలు ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. ప్రజల ఇబ్బందులు చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. ఇకపై తెదేపా రాష్ట్ర కార్యాలయంలోనూ వినతులు స్వీకరిస్తానని తెలిపారు. గత ప్రభుత్వం దెబ్బతిన్న రహదారులపై కనీసం గుంతలు కూడా పూడ్చలేదని ధ్వజమెత్తారు. ఇప్పుడు వర్షాకాలం రావడంతో ప్రజలు రోడ్లపై తిరగలేక అవస్థలు పడుతున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేయిస్తామని తెలిపారు.
Latest news,Telugu news,Politics, Andhra Pradesh,Amaravati,Chandrababu…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here