Home తెలంగాణ పోలీస్ భార్యల అరెస్ట్ || Arrest of police wives

పోలీస్ భార్యల అరెస్ట్ || Arrest of police wives

0
పోలీస్ భార్యల అరెస్ట్ || Arrest of police wives

 

Nsnnews// రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్24..రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో 17 బెటాలియన్ పోలీసుల భార్యలు రోడ్డుపై ధర్నాకు దిగారు. తమ భర్తలకు అధికారులు తీరికలేకుండా డ్యూటీలు వేస్తూ తమకు, తమ కుటుంబాలకు వారిని దూరం చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు.

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న విధంగా ఇక్కడ కూడా పోలీస్ విధానాన్ని అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఒకే పోలీసు విధానం ఉండాలని అన్నారు. అలాగే, తమ భర్తలతో లోపల కూలీ పనులు, చెత్త ఏరే పనులు, మట్టి పనులు చెయిస్తున్నా రని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసు డ్యూటీకి, తమ భర్తలు చేస్తున్న పనికి సంబంధం లేదని అన్నారు. రోడ్డెక్కిన పోలీసుల భార్యలను అదుపులోకి తీసుకున్నారు పోలీస్ భార్యలను కొట్టుకుంటూ, అరెస్ట్ చేసి 17 బెటాలియన్ కు తరలించారు.

Latestnews, Telugu news, Telangana news, Sirisilla news..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here