Home క్రైమ్ పోలీస్ తనిఖీల్లో 6,76,920/- రూపాయలు సీజ్

పోలీస్ తనిఖీల్లో 6,76,920/- రూపాయలు సీజ్

0
పోలీస్ తనిఖీల్లో  6,76,920/- రూపాయలు  సీజ్

జోగులాంబ గద్వాల జిల్లా: లోక్ సభ ఎన్నికల కోడ్ లో బాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ ల పరిధిలో, సరి హద్దు చెక్ పోస్టు లలో పోలీస్ అధికారులు చేపడుతున్న వాహన తనిఖీలలో ఈ రోజు (బుధవారం) 6,76,920/- రూపాయలను పోలీస్ అధికారులు సీజ్ చేసి జిల్లా ఎన్నికల గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటి కి అప్పగించినట్లు జిల్లా ఎస్పీ శ్రీమతి రితిరాజ్ తెలిపారు.
ఉండవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పుల్లూరు చెక్ పోస్టు దగ్గర నిర్వహించిన వాహనాల తనిఖిలలో ఐదుగురు వ్యక్తుల నుండి 3,97,420/- ( సలీం పాషా నుండి 1 లక్ష , షేక్ మహమ్మద్ ఫరూక్ నుండి 1 లక్ష, షేక్ అబ్దుల్లా నుండి 58,500/-, MD ఇమ్రాన్ నుండి 80,000/-, విశ్వనాథ్ రెడ్డి నుండి 58,920/-)రూపాయాల ను , ఐజ మండలం వెంకటాపురం స్టేజీ లో నిర్వహించిన వాహన తనిఖీలో ఒకరి నుండి 95,000/- రూపాయలను , మానో పాడు మండలo లో నిర్వహించిన వాహన తనిఖీలో ఒకరి నుండి 70,000/- రూపాయలను మరియు KT దొడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో నీ నందిన్నె చెక్ పోస్టు దగ్గర నిర్వహించిన వాహన తనిఖీలో ఒకరి వద్ద నుండి 1,14,500/- లను మొత్తం 6,76,920/- రూపాయలను ఏలాంటి రశీదు లేని వాటిగా గుర్తించి సీజ్ చేసి
జిల్లా ఎన్నికల గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీకి పోలీస్ అధికారులు అప్పగించినట్లు ఎస్పీ గారు తెలిపారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిధిలో ఎవరైన 50 వేల రూపాయల కొద్దీ ఎక్కువ డబ్బులను తీసుకువెళ్లరాదని ఒక వేళ తీసుకెళ్తే తగిన రశీదులు ,పత్రాలు వాటి వివరాలు వెంట తీసుకెళ్ళాలని జిల్లా ఎస్పీ గారు ప్రజలకు సూచించారు.పోలీస్ తనిఖీల్లో 6,76,920/- రూపాయలు సీజ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here