Home జిల్లా వార్తలు పేద వదువు వివాహానికి పుస్తే మట్టెలు అందించిన కాంగ్రెస్ నేత కౌన్సిలర్ సాకి ఆనంద్..

పేద వదువు వివాహానికి పుస్తే మట్టెలు అందించిన కాంగ్రెస్ నేత కౌన్సిలర్ సాకి ఆనంద్..

0
పేద వదువు వివాహానికి పుస్తే మట్టెలు అందించిన కాంగ్రెస్ నేత కౌన్సిలర్ సాకి ఆనంద్..

NSN NEWS// సిద్దిపేట:
సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ నగర్ 37 వ వార్డ్ లో నివసిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య అవుట్ సోర్సింగ్ కార్మికురాలు పిట్టల లక్ష్మీ – లింగం ల కనిష్ట పుత్రిక వివాహానికి స్థానిక 37 వ వార్డ్ కాంగ్రెస్ నేత కౌన్సిలర్ సాకి ఆనంద్ పుస్తే-మట్టెలు అందించారు. ఇచ్చిన మాట ప్రకారం 37 వ వార్డ్ లో ఇప్పటి వరకి ఎంతో మంది పేద వదువులకి పుస్తే మట్టెలు , ఆర్థిక సహాయం అందించడం జరిగిందని ఇలా నా వార్డ్ ప్రజలకి సేవ చేయడం ఎంతో తృప్తి కలిగిస్తుందని ఆయన అన్నారు.ఇట్టి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని సాకి ఆనంద్ తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ముత్యాల బుచ్చిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు గుర్రం శ్రీనివాస్ రెడ్డి, జెక్కుల ఎల్లెష్, ఎర్ర చక్రి, సాకి రఘు, తండ నవీన్, బత్తుల పర్షి తది తరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here