Home జిల్లా వార్తలు పేదింటి బిడ్డ నీలం మధును గెలిపించుకుంటాం

పేదింటి బిడ్డ నీలం మధును గెలిపించుకుంటాం

0
పేదింటి బిడ్డ నీలం మధును గెలిపించుకుంటాం

పేదింటి బిడ్డ నీలం మధును గెలిపించుకుంటాం

తెలంగాణ జన సమితి
పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం

హైదరాబాద్ పార్టీ ఆఫీసులో
ప్రొఫెసర్ కోదండరాం గారిని మర్యాదపూర్వంగా కలిసిన మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు

మెదక్ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన బీసీ బిడ్డ నీలం మధు ముదిరాజ్ ను గెలిపించుకుంటామని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం గారిని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. . ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మెదక్ పార్లమెంట్ పరిధి నియోజకవర్గ రాజకీయాలపై చర్చించారు. పార్లమెంట్ ఎన్నికలలో బీసీలు గెలిచేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. తమ శక్తి మొత్తాన్ని ఉపయోగించి అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తామన్నారు. మెదక్ జిల్లాలోని ప్రజా సంఘాలన్నిటిని ఏకం చేస్తామన్నారు. బీఆర్ఎస్, బిజెపిలు ఒకే భావజాలంతో పనిచేస్తున్నాయని, ఈ ఎన్నికలలో ఆయా పార్టీలను ఓడించేందుకు అందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. మెతుకు సీమ నుంచి బరిలో నిలిచిన బీసీ బిడ్డ నీలం మధును గెలిపించుకుంటామని ప్రొఫెసర్ కోదండరాం దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గ నేత హనుమంత రెడ్డి, టీజేఎస్ నేతలు నిజ్జన రమేష్, అంబటి శ్రీనివాస్, ధర్మార్జున్, బి. రమేష్, సర్దార్, వినోద్, ఆశప్ప, తుడుం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version