Home బిజినెస్ పేటీఎంలో ఉద్యోగాలు హుష్…

పేటీఎంలో ఉద్యోగాలు హుష్…

0
పేటీఎంలో ఉద్యోగాలు హుష్…

 

Nsnnews// ఢిల్లీ: పేటీఎం బ్రాండ్‌పై ఆర్థిక సేవలను అందిస్తున్న వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించింది. ఎంతమందిని తొలగించిందీ మాత్రం కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. వారు వేరే సంస్థల్లో ఉద్యోగం సాధించడంలో తాము సాయపడుతున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ‘కంపెనీ పునర్‌వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా ఉద్యోగ కోతలు చేపట్టాల్సి వచ్చింది. ఉద్యోగ విరమణ చేసిన వారికి వేరే సంస్థలో ఉద్యోగ కల్పించడంలో తోడ్పడుతున్నాం. మా హెచ్‌ఆర్‌ టీమ్‌ 30 సంస్థలతో కలిసి పనిచేస్తోంది’’ అని పేటీఎం పేర్కొంది.

2024 మార్చి నాటికి పేటీఎంలో 36,521 మంది పనిచేస్తున్నారు. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే ఈ సంఖ్య 3,500 వరకు తగ్గింది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై.. రిజర్వ్‌ బ్యాంక్‌ చర్యల నేపథ్యంలో పేటీఎం ఉద్యోగ కోతలు చేపట్టింది. ఇప్పుడు మరోసారి ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని నిర్ణయించింది. పెండింగ్‌లో ఉన్న బోనస్‌లను సైతం పేటీఎం విడుదల చేసింది. పారదర్శకంగా లేఆఫ్‌ల ప్రక్రియ చేపడుతున్నట్లు కంపెనీ పేర్కొంది. పేటీఎం పేమెట్స్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో కంపెనీ నష్టాలు పెరిగాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.167.5 కోట్ల నష్టాలను ప్రకటించిన ఆ సంస్థ.. గడిచిన ఆర్థిక సంవత్సరంలో చివరి త్రైమాసికంలో నష్టం రూ.550 కోట్లకు పెరిగింది. దీంతో ఫలితాల వెల్లడి సమయంలోనే ఉద్యోగ కోతలుంటాయని సంకేతాలు ఇచ్చింది. ఏఐ వినియోగాన్ని పెంచి తద్వారా పరిమిత సంఖ్యలో ఉద్యోగులతో కొనసాగాలని నిర్ణయానికొచ్చింది. కంపెనీని లాభదాయకతలోకి తీసుకురావడంపై పనిచేస్తున్నట్టు పేర్కొంది.

Latestnews, Telugunews, Delhi, One 97 Communications, Patym…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here