పేకాట స్థావరం పై దాడి ఆరుగురిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు...
NSN NEWS: 09-జూన్-2024
పేకాట స్థావరం పై దాడి ఆరుగురిని అదుపులోకి తీసుకొనీ వారి వద్దనుండి ₹ 24,170/- రూపాయలు స్వాధీనం చేసుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ మరియు సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు
సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ లలితా నగర్ ఒక ఇంట్లో కొంతమంది వ్యక్తులు కలసి పేకాట ఆడుతున్నారని అమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ లు వెళ్లి రైడ్ చేసి ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 24,170/- రూపాయలు స్వాధీనం చేసుకున్నారు, సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు
పేకాట ఆడిన వారి వివరాలు
1 ఉప్పలూరి శ్రీధర్
2 దొంతుల శ్రీనివాస్
3.రాళ్లబోయిన శ్రీనివాస్
4 మోటాడు అంజయ్య
5.అహోబిలం శ్రీధర్
6 పంచాంగ యాదగిరి
అందరి నివాసం రాఘవేంద్ర నగర్ సిద్దిపేట పట్టణం
ఈ సందర్భంగా *టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ* గ్రామాలలో, పట్టణాలలో ఫామ్ హౌస్ లలో, ఇళ్ళల్లో పేకాట, బహిరంగ ప్రదేశంలో జూదం మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే లేదా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446, 8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.