Nsnnews// బహిరంగంగా లారీలో పేకాటాడుతున్న 10 పేకాటరాయుళ్లను సిద్దిపేట టూ టౌన్, టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక రంగీలా దాబా చౌరస్తా సమీపంలో…పేకాటాడుతురన్న సమాచారంతో…స్థావరంపై ఏకకాలంలో దాడులు చేశారు. దాడుల్లో పట్టుబడ్డ నిందితుల నుంచి…8వేల 5వందల రూపాయలు, 11మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ హౌస్, ఇళ్ళు, బహిరంగ ప్రదేశాలలో చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Latest news,Telugu news,Crime news