Nsnnews// హైదరాబాద్ : రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు చార్జీలు మరోసారి పెరిగాయి. హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీంతో జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్‌గేట్ల వద్ద ఈ ఫీజులు స్వల్పంగా పెరిగాయి. టోల్ గేట్లతో రోడ్లపై తిరిగే ఆర్టీసీ బస్సులు కూడా టోల్ రుసుము చెల్లించాల్సింటుంది. టికెట్ చార్జీల్లో చేర్చిన టోల్ ఫీజును 3 పెంచింది. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో 10 నుంచి 13 రూపాయాలు, డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, వజ్ర బస్సుల్లో 13 నుంచి 16, గరుడ ప్లస్ బస్సుల్లో 14 నుంచి 17రూపాయాలకు పెంచగా, గరుడ ప్లస్ బస్సుల్లో 14 నుంచి 17., నాన్-ఎసి స్లీపర్, హైబ్రిడ్ స్లీపర్ బస్సులలో 15 నుంచి 18కి, ఏసీ స్లీపర్ బస్సుల్లో 20 నుంచి 23రూపాయాలకు పెరిగాయి.పెరిగిన చార్జీలు ఇటీవల అమల్లోకి వచ్చాయి.
Latestnews, Telugunews, RTC…