Nsnnews// ఫుడ్‌డెలివరీ స్టార్టప్ జొమాటో తన క్విక్కామర్స్విభాగం బ్లింకిట్‌లో 300 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. తాజా పెట్టుబడి కలిపితే.. ఆగస్ట్ 2022లో కంపెనీని కొనుగోలు చేసినప్పటి నుంచి జొమాటో బ్లింకిట్‌లో 2,300 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. జొమాటో బ్లింకిట్‌ను 4,477 కోట్లకు ఆల్-స్టాక్ డీల్‌లో కొనుగోలు చేసింది. బ్లింకిట్‌తో పాటు, జొమాటో తన అనుబంధ సంస్థ జొమాటో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 100 కోట్లను పెట్టుబడి పెట్టనుంది. జెప్టో వంటి పోటీ సంస్థలతో బ్లింకిట్‌కు పోటీ పెరుగుతున్న నేపథ్యంలో తాజా పెట్టుబడి వచ్చింది. 2024 ఆర్థిక సంవత్సరంలో బ్లింకిట్ 2,302 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది.
Latestnews, Telugunews, Zomato…