Nsnnews// భద్రాచలం: ‘అన్నిటినీ కలుపుకొని.. మౌనంగా నీలోనే దాచుకొని.. గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి.. బతుకుదారి తెలిపావే గోదావరి’ అనే పాట గుర్తుకు తెస్తోంది గోదావరిలో టన్నులకొద్దీ చేరే చెత్తాచెదారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీసీతారామస్వామి చెంతనున్న గోదావరి స్నానాల ఘట్టాల సమీపంలో అపరిశుభ్రత తాండవిస్తోంది. డంపింగ్‌యార్డులోని చెత్తాచెదారం నదిలో కలిసిపోతోంది. పంచాయతీ ఆధ్వర్యంలో రూ.1.50కోట్ల అంచనాతో భద్రాచలం పట్టణ శివారులోని ఆదర్శ కాలనీలో నూతన డంపింగ్ యార్డు నిర్మాణం చేపట్టినప్పటికీ పనుల్లో జాప్యం జరగడమే ఈ పరిస్థితికి కారణమనే విమర్శలున్నాయి.
Latest news,Telugu news, Andhra Pradesh news,Bhadrachalam…