Home తెలంగాణ పీఎం కిసాన్ యోజన రైతులకు ఓ వరం-బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

పీఎం కిసాన్ యోజన రైతులకు ఓ వరం-బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

0
పీఎం కిసాన్ యోజన రైతులకు ఓ వరం-బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

పీఎం కిసాన్ యోజన రైతులకు ఓ వరం …

 

 హుజురాబాద్ నియోజకవర్గం ఎన్ఎస్ఎన్ ప్రతినిధి జమ్మికుంట పట్టణం జూన్ 16

 

 

 

18 న వారణాసిలో ప్రధాని మోదీ కిసాన్ సమ్మేళన్ ప్రోగ్రాం…

 

*జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో వర్చువల్ గా జరిగే ప్రోగ్రామ్ కు హాజరుకానున్న కేంద్రమంత్రి సోమన్న…

 

*రైతులందరూ 18న జమ్మికుంట లో జరిగే ప్రోగ్రాంలో పాల్గొనండి…

 

బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి…

 

రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన ఓ వరం లాంటిదని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. ఈనెల 18న ప్రధాని మోదీ కిసాన్ సమ్మేళన్ ప్రోగ్రాం నేపథ్యంలో జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం లో వర్చువల్ గా జరిగే ప్రోగ్రాం ఏర్పాట్లను స్థానిక బిజెపి శ్రేణులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 18న వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్న కిసాన్ సమ్మేళన్ ప్రోగ్రాం దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వర్చువల్ గా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయనీ తెలిపారు. ఇట్టి ప్రోగ్రాం జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని, కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర జల, రైల్వే సహాయక మంత్రి వి సోమన్న హాజరవుతారని తెలిపారు. జమ్మికుంటలో జరగబోయే కార్యక్రమాన్ని రైతులందరూ విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ముఖ్యంగా 17వ విడుత కిసాన్ సమ్మన్ నిధి యోజన నిధులు విడుదల చేయడం జరిగిందని, ఇన్స్టాల్మెంట్ కు సంబంధించిన ఫైల్ పైనే మూడోసారిగా ప్రధానమంత్రి మోడీ సంతకం చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యంగా మిలియన్ల రైతులకు పెట్టుబడి కోసం ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తుందన్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సమయం ప్రారంభం కావడంతో రైతులకు పెట్టుబడికి ఇది బాగా ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో KVK శాస్త్రవేత్తలు వెంకటేశ్వర్లు రావు ప్రభాకర్ అనిల్ ప్రశాంతి జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్ జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ జిల్లా కిషన్ మోర్చా మాడుగుల సమ్మిరెడ్డి జమ్మికుంట మండల అధ్యక్షుడు సంపెల్లి సంపత్ రావు పల్లపు రవి దొంతల రాజకుమార్ పరిపెల్లి కొండల్ రెడ్డి కైలాసకోటి గణేష్ మోతే స్వామి అప్పం మధు యాదవ్ ఇటుకల స్వరూప భీమిలి కిషన్ రావు మోడం రాజు గిరవని విజేందర్ మేక సుధాకర్ రెడ్డి రాచపల్లి ప్రశాంత్ గర్రెపల్లి నిరుపా రాణి దేవులపల్లి నవీన్ బచ్చు శివకుమార్ రవీందర్ బద్రి యాంసాని సమ్మయ్య కొండపర్తి ప్రవీణ్ రాపర్తి ప్రవీణ్ కేశ స్వరూప రాపర్తి అఖిల్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here