Nsnnews// పారిస్ ఒలింపిక్స్ లో దీప్తి జీవాంజీ కాంస్య పతకం గెలవడంతో..ఆమె స్వగ్రామం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో సంబరాలు అంబరాన్నంటాయి. దీప్తి విజయంపై గ్రామస్థులు, పాఠశాల విద్యార్థులు హర్షం వ్యక్తంచేశారు. పారాలింపిక్స్ లో పతకం సాధించిన తొలి తెలుగు క్రీడాకారిణిగా దీప్తి చరిత్ర సృష్టించారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన దీప్తి క్రీడాకారిణిగా రాణిస్తున్నారు. తమ కుమార్తె సాధించిన విజయం పట్ల.. తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అండగా నిలిస్తే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆకాంక్షించారు.
Latestnews, Telugunewws, Paris Olympics, Deepti Jeevanji…