Nsnnews// సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చర్ల అంకిరెడ్డిపల్లిలో.. ప్రత్యేక అధికారి గ్రామసభ నిర్వహించారు. గ్రామాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ కార్మికులు, మల్టీపర్పస్ వర్కర్లను సన్మానించారు. పరిసరాలను పరిశుభ్రతకు పాటుపడుతున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమన్నారు..కాంగ్రెస్ నాయకులు అజ్జు యాదవ్. గ్రామంలో పచ్చదనం వెళ్లివిరియడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ప్రశంసనీయమైనదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ సిద్దిపేట జిల్లా కార్యదర్శి చిక్కుడు అనిల్ కుమార్, గ్రామ ప్రత్యేక అధికారి సాయి, వ్యవసాయ శాఖ అధికారులు,ఏఎన్ఎంలు, అంగన్వాడి టీచర్లు,ఆశా వర్కర్లు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
Latest news,Telugu news,Telangana news,Siddipet news