పాము కుట్టి పాడి గేదె మృతి చెందిన ఘటన కోహెడ మండలం పోరెడ్డిపల్లె గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పోరెడ్డిపల్లె గ్రామానికి చెందిన పంజాల సత్యనారాయణ అనే రైతుకు చెందిన ఆవు వ్యవసాయ పొలంలో మేత మేస్తుండగా పాము కాటు వేసింది. దీంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. ఆకస్మాత్తుగా పాడి ఆవు మృతి చెందడంతో 60 వేల రూపాయల నష్టం జరిగిందని రైతు వాపోయాడు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.