Nsnnews// హైదరాబాద్: పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘హరిహర వీరమల్లు’ . క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, రాజకీయాలతో బిజీగా ఉండటంతో పవన్‌కల్యాణ్ ఈ సినిమా షూటింగ్‌కు కొంతకాలం నుంచి దూరంగా ఉన్నారు. ఈనేపథ్యంలో నిర్మాత ఎ.ఎం.రత్నం, దర్శకుడు జ్యోతికృష్ణ తాజాగా ఆయన్ని కలిసి చిత్రీకరణ గురించి మాట్లాడారు. ఈవిషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణసంస్థ ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. ‘‘ది లెజండరీ, మోస్ట్ వాంటెడ్ పోరాటయోధుడు హరిహరవీరమల్లు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. తన అన్వేషణను తిరిగి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. మరెన్నో ఆసక్తికర అప్‌డేట్‌లు త్వరలో రానున్నాయి’’ అని పేర్కొంది.
దీనిపై పవన్ అభిమానులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. పవన్‌కల్యాణ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్, పాన్ ఇండియా, చారిత్రక నేపథ్యం లాంటి విశేషాలతో రూపుదిద్దుకుంటోంది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకురానున్నారు. మొదటి పార్ట్‌ను ‘‘స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’’ పేరుతో విడుదల చేయనున్నారు. ‘ధర్మం కోసం యుద్ధం’ అనేది ఉప శీర్షిక. ఈ ఏడాది చివర్లో ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. నిధి అగర్వాల్ కథానాయిక. బాబీ దేవోల్, సునీల్, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రఖ్యాత హాలీవుడ్ సాంకేతిక నిపుణుడు బెన్‌లాక్ ఈ చిత్రానికి వీఎఫ్ఎక్స్ హంగులను సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లు, ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా ఉండటంతో ప్రేక్షకులు, అభిమానులకు ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
Latestnews, Telugunews, Hyderabad, Pawan Kalyan, Hari Hara Veera Mallu..