Home జిల్లా వార్తలు పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌పై అవగాహన సదస్సు || Awareness Conference on Personality Development

పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌పై అవగాహన సదస్సు || Awareness Conference on Personality Development

0
పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌పై అవగాహన సదస్సు || Awareness Conference on Personality Development

 

Nsnnews// ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్వహించే టెలిమానస్ ప్రోగ్రాంలో భాగంగా స్టూడెంట్ కౌన్సిలర్ కనకచంద్రం ఆధ్వర్యంలో సిద్దిపేట ఇంటర్ కాలేజీలో విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్మెంట్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రముఖ సైకాలజిస్ట్, సిద్దిపేట డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిగతంగా మనోధైర్యంగా ఉండాలన్నారు. ఏదైనా సమస్యలచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాల్నారు. ఇతర వ్యక్తులతో మాట్లాడకపోవడం.. ఎక్కువగా ఆలోచించడం.. ఇలాంటివారు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తారని చెప్పారు. సమాజంలో వారిని గుర్తించడం మన బాధ్యతని.. వారికి మనధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణరెడ్డి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సుధాకర్ రెడ్డి, సీనియర్ అధ్యాపకులు దేవయ్య, అశోక్, గంగాధర్, ప్రసాద్, చక్రవర్తి, వెంకటరమణ, విజయభాస్కర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Latest news,Telugu news,Telangana news,Siddipet news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here