Nsnnews// శీతాకాలం వచ్చిందంటే ఢిల్లీ సహా ఉత్తర భారతంలో గాలి నాణ్యత దిగజారుతుండటంతో… సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పంట వ్యర్థాలు తగలబెట్టడం సమస్యపై కఠిన చట్టాలు రూపొందించకపోవడంపై కేంద్రంపై మండిపడింది. ఢిల్లీలో వాయు కాలుష్యంపై విచారణ జరిపిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం….సవరణలతో పర్యావరణ చట్టాలను ఎలాంటి ప్రభావం చూపనివాటిగా మారుస్తున్నారని వ్యాఖ్యానించింది. గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ చట్టం ప్రకారం.. పంట వ్యర్థాలు తగులబెట్టినందుకు జరిమానా విధించే నిబంధన అమలు చేయడం లేదని పేర్కొంది. పంట వ్యర్థాలు కాల్చుతున్న హరియాణా, పంజాబ్ రాష్ట్రాలపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వ్యర్థాలు తగులబెట్టినందుకు దోషులుగా తేలిన వారిపై విచారణ జరపకపోవడంపై ఆ రెండు రాష్ట్రాలను నిలదీసింది. 10 రోజుల్లో CAQM చట్టం ప్రకారం… జరిమానా ఆదేశాలు జారీచేస్తామని కేంద్రం తరఫున విచారణకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి తెలిపారు.
Latest news, Telugu news, National news, Environmental news, Supreme court..