Nsnnews// వరంగల్-ఖమ్మం-నల్గొండ శాసనమండలి నియోజకవర్గ ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగిసింది.11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. వీరిలో ఒకరు యువతరం పార్టీ అభ్యర్థి కాగా మిగిలిన 10 మంది స్వతంత్ర అభ్యర్థులు.ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ పేపర్ ద్వారా ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో 4.63 లక్షల మంది ఓటర్లున్నారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
Latest News , Telugu News