Nsnnews// ఢిల్లీ: కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ద ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ (ఐఎన్‌ఎస్) అధ్యక్షుడు రాకేశ్ శర్మ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం ఇటీవల భేటీ అయింది. ఈ సందర్భంగా పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. న్యూస్‌ప్రింట్‌పై 5 శాతం కస్టమ్స్ సుంకాన్ని ఉపసంహరించాలని మంత్రిని కోరారు. తొమ్మిదో ‘రేట్ స్ట్రక్చర్ కమిటీ’ సిఫారసులు, డిజిటల్ న్యూస్ సబ్‌స్క్రిప్షన్‌పై జీఎస్‌టీ ఉపసంహరణ, ఐక్యరాజ్యసమితి భాషల్లో భారతీయ వార్తా పత్రికల అనువాదం, ఇ-పేపర్లకు విడిగా రేట్ల పరిశీలన, ఆడిటెడ్ సర్క్యులేషన్ సర్టిఫికెట్ల(ఏబీసీ) సమర్పణకు గడువు పొడిగింపు, ప్రింట్ మీడియాకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) బడ్జెట్ సవరణ, సీబీసీకి చెల్లించాల్సిన బకాయిలు.. తదితర అంశాలపైనా ఐఎన్‌ఎస్ బృందం విస్తృత స్థాయిలో మంత్రితో చర్చించినట్లు ఐఎన్‌ఎస్ సెక్రటరీ జనరల్ మేరీ పాల్ వెల్లడించారు. అన్ని అంశాలను సావధానంగా ఆలకించిన మంత్రి, సానుకూల దృక్పథంతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వివరించారు.
Latest news,Telugu news,Business news