Nsnnews// వాషింగ్టన్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఆగస్టు 18న నిర్వహించనున్న చారిత్రక ‘ఇండియా డే’ కవాతులో అయోధ్య రామమందిర నమూనాను ప్రదర్శించనున్నారు. న్యూయార్క్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది ఇండియన్ అమెరికన్లను ఈ నమూనా ఆకట్టుకోనుంది. ఈ ఆలయ నమూనా 18 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు ఉంటుందని విశ్వహిందూ పరిషత్ అమెరికా (వీహెచ్‌పీఏ) ప్రధాన కార్యదర్శి అమితాబ్ మిత్తల్ తెలిపారు. అమెరికాలో అయోధ్య రామమందిర నమూనాను ప్రదర్శించడం ఇదే తొలిసారని అన్నారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం తర్వాత ఏటా న్యూయార్క్‌లో జరుపుకొనే ఈ ‘ఇండియా డే’ కవాతును స్వదేశానికి వెలుపల జరిగే వేడుకల్లోకెల్లా అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. న్యూయార్క్ నగరంలోని ఈస్ట్ 38వ వీధి నుంచి ఈస్ట్ 27వ వీధి వరకు కొనసాగే ఈ కవాతును ఏటా 1,50,000 మందికి పైగా తిలకిస్తారు. భారత సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఐఏ) నిర్వహించే ఈ కార్యక్రమం న్యూయార్క్ వీధుల్లో ఇండియన్ అమెరికన్ వర్గాల సాంస్కృతిక భిన్నత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
Latest news,Telugu news, ‘India Day’…