Nsnnews// టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇవాళ రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. మహారాష్ట్రలోని పూనే వేదికగా… ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండవ టెస్ట్ ప్రారంభం అవుతుంది. ఇవాళ ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో… ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే మొదటి టెస్టులో… వర్షం కురవడం… పిచ్ పరిస్థితి పూర్తిగా మారిపోవడంతో.. టీమిండియా దారుణంగా ఓడిపోయింది.
అయితే రెండవ టెస్టు మాత్రం.. టీమిండియా కు చాలా కీలకం. అందుకే రెండవ టెస్టులో మాత్రం స్పిన్ కు అనుకూలించే మైదానాన్ని రెడీ చేశారు. అదే సమయంలో గిల్ ఈ మ్యాచ్ తో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడట. అయితే గిల్ వస్తే ఎవరిని తప్పిస్తారనే… దానిపైన కొత్త చర్చ నెలకు ఉంది. అటు మహమ్మద్ సిరాజ్…ఈ మ్యాచ్ కు ఆడే అవకాశాలు.. లేనట్లు సమాచారం. అతని స్థానంలో ఆకాశదీప్ కుఅవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే బెంగళూరు తరహాలో పూణేలో వర్షం పడే అవకాశాలు లేవని చెబుతున్నారు.
Latestnews, Telugunews, IND vs NZ 2nd Test..