Nsnnews// భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ క్లియర్ టైటిల్ తో డాక్యుమెంట్ ఇచ్చేలా నూతన భూపోర్టల్ ను తీసుకువస్తున్నామని… రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ నుంచి మీడియాతో మాట్లాడిన మంత్రి.. ప్రస్తుత ధరణిలో ఉన్న ఒకే కాలమ్ బదులుగా 13నుంచి 14కాలమ్స్ తీసుకురానున్నట్లు తెలిపారు. గతంలో 35 మాడ్యూల్స్ వల్ల ఏదైనా తప్పుగా నమోదైతే తిరస్కరణకు గురయ్యేదని తెలిపారు. ఇప్పుడు తెచ్చే కొత్త పోర్టల్ లో వాటిని సవరిస్తూ.. సింగిల్ డిజిట్ లోనే మాడ్యూల్స్ ఉంచుతామని పేర్కొన్నారు.
Latestnews, Telugu news, Telangana news, New landportal, Pongaleti Srinivasreddy..