Nsnnews// రోడ్లు బాగుంటేనే..ప్రజల జీవన విధానం బాగుంటుందని చెప్పుకునే ప్రభుత్వాలు..ముఖం చాటేస్తున్నాయి. ఎన్నికలు రాగానే కనిపించే రాజకీయ నాయకులు.. గ్రామాలు సమస్యలు ఎదుర్కొనే సమయంలో కానరాని దుస్థితి నెలకొంది. అభివృద్ధి అనే మాట పక్కన పెడితే..ఇక ఆగ్రామానికి వెళ్లే రోడ్డు మాత్రం గుంతలమయంగా మారి.. నరకానికి మెట్లు కట్టేందుకు దారి చూపిస్తుందనే మాటను నిజం చేస్తోంది. గుంతలమయంగా మారి, ప్రమాదాలకు నెలవుగా నిలుస్తూ..నిత్యగండంగా మారిన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అందె రోడ్లపై..ఎన్ఎస్ఎన్ న్యూస్ స్పెషల్ స్టోరీ.
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని అందెలో 20 సంత్సరాల క్రితం నిర్మించిన రోడ్డు.. ఏండ్లు గడిచిన మరమ్మత్తుల అలంకరణకు నోచుకోవడం లేదు. గుంతలమయంగా మారిన రోడ్డు, ప్రమాదకర మూలమలుపులతో మండల కేంద్రం నుండి ఆ గ్రామానికి వెళ్లే రహదారి..నిత్యం రక్తాన్ని చిందిస్తోంది. మరమ్మత్తులకు నోచుకోలేని అద్వాన పరిస్థితుల నడుమ అభద్రతతో కూడిన రోడ్లపై..పనుల నిమిత్తం రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రయాణీకులు ప్రమాదాల భారీన పడుతున్నారు. అసౌకర్యాలకు నెలవైన రోడ్లపై ప్రయాణించే వాహదనదారులు, ప్రయాణీకులు నరక ప్రాయసాలు ఎదుర్కొంటున్నారు. నిత్యం పనుల నిమిత్తం మండల కేంద్రానికి వచ్చే.. ప్రజలు మాత్రం ప్రాణాలను అరచేతిలో పట్టుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇది చాలదు అన్నట్టుగా..హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి, రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలు భారీగా విస్తరించడంతో…దూరం నుంచి వచ్చే వాహనదారులకు..ఎదురుగా వచ్చే ఇతర వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగిన దాఖలాలు అనేకమనే చెప్పొచ్చు. ఈ చెట్ల కొమ్మల కారణంగా… మూలమలుపుల వద్ద దారి కనిపించక..పక్కన ఉండే బావులు. గుంతలలో పడే అవకాశాలు చాలనే ఉన్నాయని గ్రామస్థులు, వాహనదారులు వాపోతున్నారు.
ఇక…ఈ అద్వాన పరిస్థితులతో కూడిన రోడ్లపై ప్రయాణిస్తే..తమ వాహనాలు పూర్తిగా ఆటకెక్కె దుస్థితి కనిపిస్తోందని…ఆటోవాలాలు చెబుతున్నారు. పొట్టా కూటి కోసం..అప్పులు చేసి కొనుగోలు చేసిన ఆటోలు నడుపుతూ…జీవనం సాగిస్తున్నామన్నారు. తమకు జీవనభృతి కల్పిస్తున్న తమ వాహనాలు.. గుంతల రోడ్లపై నడిపితే చెడిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. చెమటోడ్చి సంపాందించిన సంపద మొత్తం కూడా..ఆటోల మరమత్తులకే ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. మరమ్మత్తుల కారణంగా..నెల వచ్చే సారికి..కుటుంబం గడవడం కష్టంగా మారిందన్నారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు మారిన..అందె గ్రామ రోడ్లు ఇంకా అంధకారంలోనే మగ్గుతున్నాయని..పాలకుల, అధికారుల తీరు పట్ల ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పట్టని నాయకులు..ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు అనర్హులని మండిపడ్డారు. నూతనంగా రోడ్డు నిర్మించి, వాహనదారులు, ప్రయాణీకులను ప్రమాదాల భారి నుంచి కాపాడాలని కోరుతున్నారు. ఇప్పటీకైనా అధికారులు, ప్రభుత్వం.. మొద్దునిద్ర వీడి రోడ్డు పనులు త్వరితగతిన ప్రారంభించి, పూర్తిచేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆగ్రామ ప్రజలు, వాహనదారులు.
Latest news,Telugu news,Telangana news,Siddipet news