Nsnnews// సిద్దిపేట: వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయం యందు 6వ తరగతిలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు… దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు.నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు, 5వ తరగతి వరకు ఉమ్మడి మెదక్‌లోనే చదవడంతో పాటు, తల్లిదండ్రులు ఉమ్మడి జిల్లాకు చెందినవారై ఉండాలన్నారు. ఆసక్తిగల వారు ఆన్‌లైన్‌లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ఇందుకు గాను.. ప్రధానోపాధ్యాయుడి సంతకంతో కూడిన ధృవపత్రం, నివాసపత్రం, అభ్యర్థి ఫోటో, సంతకంను ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుందని సూచించారు. దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే నెల సెప్టెంబర్ 16వ తేదీగా నిర్ణయించినట్టు చెప్పారు. ప్రవేశ పరీక్ష జనవరి 18 2025న పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
Latest news,Telugu news,Telangana news,Siddipet news