Nsnnews// యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు దర్శించుకున్నారు. రుణమాఫీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. ఈ అంశంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆయన ఆలయాల పర్యటన చేపట్టారు. దీనిలో భాగంగా తొలుత యాదాద్రి నారసింహుడిని దర్శించుకున్నారు. ఆగస్టు 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టేసి రైతులను దగా చేశారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు ఎలాంటి కీడు జరగొద్దని కోరుతూ ఆలయంలో పాప పరిహార పూజలు చేసినట్లు తెలిపారు.
Latest news,Telugu news,Telangana news