Home బ్రేకింగ్ దుమారం రేపుతున్న కొండా సురేఖ వ్యాఖ్యలు || Film Industry Serious On Konda Surekha Comments

దుమారం రేపుతున్న కొండా సురేఖ వ్యాఖ్యలు || Film Industry Serious On Konda Surekha Comments

0
దుమారం రేపుతున్న కొండా సురేఖ వ్యాఖ్యలు || Film Industry Serious On Konda Surekha Comments

 

Nsnnews// కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. కొండా సురేఖ క్షమాపణ చెప్పాలంటూ.. లీగల్‌ నోటీసులు పంపారు కేటీఆర్‌. 24గంటల్లోగా ఆధారాలు చూపించకపోతే పరువునష్టం దావా వేస్తానంటూ.. కేటీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

సినీ ఇండస్ట్రీ మహిళలను చిన్నచూపు చూడటం మానేయండంటూ..సమంత వ్యాఖ్యనించారు. సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్న చూపా అంటూ.. ప్రకాశ్‌రాజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొండా సురేఖ వ్యాఖ్యలను ఇండస్ట్రీ మొత్తం ఖండించాలన్నారు కోన వెంకట్‌. కొండా సురేఖ వ్యాఖ్యలు జుగుస్పాకరం, హేయంగా ఉన్నాయన్నారు రోజా . నిరాధారమైన మాటలు మాట్లాడటం సరికాదని హీరో నాని మండిపడ్డారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై భగ్గుమన్నది అక్కినేని కుటుంబం. రాజకీయాల కోసం మా జీవితాలతో ఆడుకోవద్దంటూ నిప్పులు చెరిగారు నాగార్జున. కొండా సురేఖ..తన వ్యాఖ్యల్ని వెనక్కితీసుకుని క్షమాపణ చెప్పాలని నాగార్జున డిమాండ్ చేశాడు. కొండా సురేఖ.. దెయ్యం పట్టినట్లుగా రాక్షసంగా మాట్లాడారని అమల విమర్శించారు.  మిస్టర్ రాహుల్‌గాంధీ.. మీ నేతలను అదుపులో ఉంచండి అంటూ.. అమల ట్వీట్‌ చేసింది.  మీ మర్యాదను కాపాడుకోవాలనుకుంటే… సురేఖతో క్షమాపణలు చెప్పించాలన్న అమల…నాగార్జున ట్వీట్‌నే రీపోస్ట్ చేశారు నాగచైతన్య. సురేఖ వ్యాఖ్యలు అబద్ధమంటూ ట్వీట్‌ చేసింది అక్కినేని ఫ్యామిలీ.

Latest news,Telugu news,Andhra pradesh news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here