Nsnnews// దేశ రాజధాని దిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 1లోని ఓ పైకప్పు కూలిపోయి ఒకరు మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో పాటు పైకప్పు కింది పార్క్ చేసిన ట్యాక్సీలు సహా అనేక వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. పైకప్పు కూలినట్లు తమకు ఉదయం 5:30 గంటల సమయంలో సమాచారం అందినట్లు అధికారులు తెలిపారు.
Latest news,Telugu news, heavy rains,national capital, DelhiIndira Gandhi Airport…