Nsnnews// హైదరాబాద్:మే 15
రేషన్ కార్డు ఉన్నవారికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పా రు.ఇప్పటి వరకు రేషన్ సరుకులుగా బియ్యం, చక్కెర, కొన్ని చోట్ల గోదుమలు ఇస్తున్న సంగతి తెలిసిందే.
అయితే వీటితోపాటు మరి కొన్ని సరుకులు అదనంగా ఇస్తామని సీఎం ప్రకటిం చారు. రేషన్ దుకాణాల్లో ఎక్కువ వస్తువులను సబ్సిడీకి పంపిణీ చేయ నున్నట్లు వెల్లడించారు.
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగియటంతో రాజకీయాలు అయిపో యానని నేటి నుంచి ప్రజాపాలనపై దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా రైతులు, తాగు నీరు, సాగు నీరు, విద్యా ర్థులు తదితర అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు.
రైతు రుణమాఫీపై గతంలో ఇచ్చిన హామీని కచ్చితంగా నిలబెట్టుకుంటామని వెల్లడించారు. ఆగస్టు 15 లోపు రైతులకు ఓకే విడతలో రుణమాఫీ చేయనున్నట్లు తెలిపారు.
రైతులు ఆ ధైర్య పడొద్దని ధాన్యం పూర్తిగా కొనుగోలు చేస్తామని వెల్లడించారు. మిల్లర్స్ అక్రమాలు చేస్తామంటే ఉరుకునేది లేదని.. తాట తీస్తామని హెచ్చరించారు.
తాము చెప్పిన పంటలకు మద్దతు ధర కచ్చితంగా ఇస్తామన్నారు. ఒక కొత్త రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని కార్డులులేని పేదలకు కార్డులు మంజూరు చేస్తామన్నారు.
Latest News , Telugu News