Home తెలంగాణ త్వరలో పూర్తి నివేదిక అందిస్తాం విజిలెన్స్‌ డీజీ || Vigilance DG will give full report soon

త్వరలో పూర్తి నివేదిక అందిస్తాం విజిలెన్స్‌ డీజీ || Vigilance DG will give full report soon

0

 

Nsnnews// కాళేశ్వరం కమిషన్‌కు తెలిపిన విజిలెన్స్‌ డీజీ. హైదరాబాద్‌, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నివేదికను త్వరలోనే అందించనున్నట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) కొత్తకోట శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన కాళేశ్వరం విచారణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ పినాకి చంద్రఘో్‌షను కలిశారు. విచారణ పూర్తి కావస్తోందని నివేదించారు. జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) కూడా త్వరలోనే నివేదిక సమర్పించనున్నట్లు కమిషన్‌కు సమాచారం ఇచ్చింది. బుధవారం నుంచి కమిషన్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ పునఃప్రారంభించనుంది. ఈ దఫా ఇదివరకే విచారణకు హాజరైన రామగుండం మాజీ ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లుతో పాటు గజ్వేల్‌ ఈఎన్‌సీ బి.హరిరామ్‌ను కూడా పిలిచే అవకాశాలున్నాయి.

Latestnews, Telugunews, Telangananews, Hyderabadnews, Kaleswaram project…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version