Nsnnews// ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(71)ను వెంటాడిన తోషాఖానా కేసులో మరో ఊరట లభించింది. 2022లో తోషాఖానా అవినీతికి సంబంధించి ఆయన్ను ఎన్నికల కమిషన్ అనర్హుడిగా ప్రకటించడంపై నిరసన ప్రదర్శన జరిపినందుకు నమోదైన కేసు నుంచి బుధవారం ఇమ్రాన్‌తోపాటు ఆయన పార్టీ సీనియర్ నేతలను ఇస్లామాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు విముక్తుల్ని చేసింది. ఇతర దేశాల అధినేతల నుంచి పాకిస్థాన్ పాలకులకు అందే బహుమతులను భద్రపరిచే ఖజానాను తోషాఖానా అంటారు. ప్రధాని హోదాలో తనకు అందిన బహుమతులను ఇమ్రాన్ అమ్ముకున్నారని ఆరోపణ వచ్చింది. నిరుడు ఆగస్టు 5న తోషాఖానా కేసులో ఇమ్రాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించినా ఇస్లామాబాద్ హైకోర్టు దాన్ని సస్పెండ్ చేసింది.
Latest news,Telugu news,World news…