Home తెలంగాణ తెలంగాణ విద్యుత్ బిడ్ల విషయంలో హైకోర్టు స్టే || High Court stay on Telangana electricity bills..

తెలంగాణ విద్యుత్ బిడ్ల విషయంలో హైకోర్టు స్టే || High Court stay on Telangana electricity bills..

0
తెలంగాణ విద్యుత్ బిడ్ల విషయంలో హైకోర్టు స్టే || High Court stay on Telangana electricity bills..

 

Nsnnews// విద్యుత్​ కొనుగోళ్ల వ్యవహారానికి సంబంధించి… రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. విద్యుత్​ కొనుగోళ్ల బకాయిల చెల్లింపులపై… గత కొంత కాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే 261కోట్లు చెల్లించాలని.. పవర్​ గ్రిడ్​ కార్పొరేషన్ నేషనల్​ లోడ్​ డిస్పాచ్​ సెంటర్లో ఫిర్యాదు చేయడంతో.. విద్యుత్​ కొనుగోళ్ల బిడ్​లో పాల్గొనకుండా ఆ విభాగం అడ్డుకుంది. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై..రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో లంచ్​ మోషన్​ పిటిషన్ వేసింది. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. నేషనల్​ లోడ్​ డిస్పాచ్​ సెంటర్​ నిర్ణయంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్‌ ఎక్స్ఛేంజీల్లో కొనుగోళ్లు, అమ్మకాలు చేయకుండా తెలంగాణ ప్రభుత్వంపై.. గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయంపై కూడా.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. విద్యుత్ కొనుగోలు, అమ్మకాల్లో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనేలా అనుమతించాలంటూ… గ్రిడ్ కంట్రోల్ ఆఫ్‌ ఇండియాను హైకోర్టు ఆదేశించింది.

తదుపరి విచారణను దసరా సెలవుల తర్వాత చేపడతామని వాయిదా వేసింది. రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ను డిస్కంలు ప్రతిరోజూ ఎక్స్ఛేంజీల్లో కొనుగోలు చేస్తుంటాయి. కానీ..డిస్కంలు బిడ్‌లలో పాల్గొనలేకపోయాయి. విద్యుత్తు కొనుగోలుకు సంబంధించిన రూ.261 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం చెల్లించడం లేదని తక్షణమే చెల్లించాలని.. నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్‌కు ఛత్తీస్​గఢ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ డిస్కంలు విద్యుత్తు బిడ్లలో పాల్గొనకుండా.. గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా అడ్డుకుంది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది.ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్​మోషన్​ పిటిషన్‌ను జస్టిస్ సీవీ భాస్కర్‌ రెడ్డి విచారించారు. 2వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కోసం ఛత్తీస్​గఢ్ ప్రభుత్వంతో గత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని ..అయితే ప్రస్తుతం వేయి మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే కొనుగోలు చేస్తున్నట్లు అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌ రెడ్డి కోర్టుకు తెలిపారు. కొనుగోలు చేసినా చేయకపోయినా బకాయి చెల్లించాల్సిందేనంటూ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మెలికపెట్టిందని.. దీన్ని కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి దృష్టికి తీసుకెళ్లామని అడ్వకేట్ జనరల్ వాదించారు.

Latestnews, Telugunews, Purchase of electricity, Highcourt…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here