Nsnnews// బహుజన ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ నిలిచిందని..దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. వీరనారి 129వ జయంతి వేడులకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే…ఆమె విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు..ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని కొనియాడారు. భూమి, భుక్తి కోసం..వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందేందుకు.. సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం.. తెలంగాణ అస్తిత్వాన్ని చాటి చెప్పాయన్నారు. పోరాటతత్వం తెలంగాణ మట్టిలో ఉందని చెప్పడానికి ఐలమ్మ జీవితమే.. నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో..రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మున్సిపల్ చైర్మన్ గన్నే వనిత భూమిరెడ్డిలతో పాటు.., మాజీ జడ్పీటీసీ రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు పల్లె వంశీకృష్ణ, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest news,Telugu news,Telangana news,Politics news