Home జాతీయం తిరుమల లడ్డూపై విచారణ జరగాల్సిందే || There should be an inquiry on Tirumala Laddu

తిరుమల లడ్డూపై విచారణ జరగాల్సిందే || There should be an inquiry on Tirumala Laddu

0
తిరుమల లడ్డూపై విచారణ జరగాల్సిందే || There should be an inquiry on Tirumala Laddu

 

Nsnnews// తిరుమలలో లడ్డు తయారిలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడి ఉంటే.. తక్షణం సీబీఐతో విచారణ జరిపించాలని.. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మహా పాపానికి, ఘోర అపచారానికి పాల్పడిన వారేవరో తేల్చాలని ఎక్స్‌ వేదిక ద్వారా కోరారు.

తిరుమలను అపవిత్రం చేస్తూ, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా.., టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని షర్మిల మండిపడ్డారు. సీఎం హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ.. చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశుడికే మచ్చ తెచ్చేలా ఉన్నాయని షర్మిల ధ్వజమెత్తారు. ఆయన చేసిన ఆరోపణల్లో రాజకీయ కోణం,సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ఉద్దేశ్యమే లేకుంటే విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

Latest news,Telugu news,National news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here