Nsnnews// తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందని..ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. టీటీడీ ఆస్తులను గత పాలకమండలి అమ్మే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. దేవుడి ఆభరణాలకు వైసీపీ హయాంలోని టీటీడీ బోర్డు రక్షణ కల్పించిందా లేదా అనే కోణంలో విచారణ అవసరమన్నారు. తిరుమలలో గత ప్రభుత్వం చేసిన అన్యాయాలు, అక్రమాలపై పవన్ ప్రకటన విడుదల చేశారు వేంకటేశ్వర స్వామిపై భక్తితో ఆస్తుల దస్తావేజులను కొందరు భక్తులు హుండీలో వేస్తారని… నిరర్థకం అంటూ వైసీపీ హయాంలోని టీటీడీ పాలక మండలి వాటిని అమ్మకానికి పెట్టిందన్నారు. తద్వారా 100 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని యత్నించారని. ప్రతిపక్షాలు, హిందూ ధార్మిక సంస్థల పోరాటంతో ఆ ప్రక్రియ ఆగిందన్నారు. దీని వెనుక ఎవరున్నరనేది బయటికి తీస్తామన్నారు. పాలక మండళ్లకు నేతృత్వం వహించినవారు స్వామివారి ఆస్తులను అమ్మేశారని సందేహం వ్యక్తంచేశారు.
Latest news,Telugu news,Andhra pradesh news