Nsnnews// వరద ప్రభావం తగ్గిన గ్రామాల్లో రోడ్లు, తాగునీటి సరఫరా పునరుద్ధరణ, పారిశుద్ధ్య పనులు వెంటనే చేపట్టాలని.. అధికారులను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలతో గ్రామాల్లో దెబ్బతిన్న… రోడ్లు, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా వ్యవస్థ పునరుద్ధరణపై… పంచాయతీరాజ్ జిల్లాల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కష్టకాలంలో ప్రజలకు తోడుగా నిలవాలని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి చెప్పారు. అవసరమైన నిధులను ప్రభుత్వం సిద్ధం చేస్తుందన్నారు. గ్రామాల్లో చెరువులు, వాగులు, కాలువలపై నిర్మించిన అక్రమ కట్టడాల జాబితాను.. జిల్లాల కలెక్టర్లకు ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గ్రామాల్లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను శుద్దిచేసి… క్లోరినేషన్ చేయాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి.. నష్టం అంచనా వేసి నివేదికలు ఇవ్వాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ప్రతీ మండలంలో ఐదుగురు అధికారులతో.. వరద నిర్వహణ కమిటీలు వేయాలని సీతక్క అధికారులను ఆదేశించారు.
Latest news,Telugu news,Telangana news,Politics news