Nsnnews// క్రీడల వల్ల విద్యార్థుల్లో మానసిక వికాసం పెరుగుతుందని… కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. అందుకే తల్లిదండ్రులు పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా ఉత్సవాల్లో భాగంగా స్థానిక విజ్జీ మైదానంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న… ఉత్తరాంధ్ర స్థాయి ఇన్విటేషన్ క్రీడల పోటీలను ఆయన ప్రారంభించారు. ముందుగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, స్థానిక MLA అదితి గజపతి రాజుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. తర్వాత విద్యార్థుల వద్దకు వెళ్లి ఒక్కక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ… పరిచయం చేసుకున్నారు. ఆటల పోటీలు తిలకించిన రామ్మోహన్ నాయుడు… తర్వాత గెలుపొందిన జట్టులకు బహుమతులు ప్రదానం చేశారు.
Latest news,Telugu news,Vizianagaram District,Andhra Pradesh news