Nsnnews// వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసు లో ఉన్న జో బైడెన్ వయసు ఎన్నికల్లో కీలకాంశంగా మారింది. ఆయన దిగిపోవాలని స్వపక్షం నేతలే డిమాండు చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఆయనకు ప్రపంచస్థాయి నేతల నుంచి మద్దతు దక్కింది. మూడు రోజుల పాటు జరిగిన నాటో దేశాధినేతల సదస్సులో వారు ఆయన్ను గమనించారు. రేసు నుంచి బైడెన్ వైదొలగాలంటూ వస్తోన్న విమర్శలపై బ్రిటన్ కొత్త ప్రధాని కీర్ స్టార్మర్ మాట్లాడుతూ.. ‘‘తమ అధ్యక్షుడిగా ఎవరుండాలో అమెరికా ప్రజలు నిర్ణయించుకోవాలి. చర్చల సమయంలో ఆయన మంచి ఫామ్‌లో కనిపించారు’’ అని అన్నారు. ‘‘డిన్నర్‌లో భాగంగా బైడెన్‌తో సుదీర్ఘంగా మాట్లాడాను. బాధ్యతాయుతమైన అధ్యక్షుడిని చూశాను. ఆయనకు తెలిసిన విషయాలపై మంచి స్పష్టతతో ఉన్నారు. కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుంటాయి.
అలా నాక్కూడా జరిగాయి. భవిష్యత్తులోనూ అలా జరగొచ్చు’’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ అభిప్రాయపడ్డారు. జర్మనీ అధ్యక్షుడు ఒలాఫ్ స్కాల్జ్ కూడా ఇదే తరహాలో స్పందించారు. ‘‘మీరు ఒక వ్యక్తిని తదేకంగా గమనిస్తే.. ఆ పొరపాట్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి’’ అని వ్యాఖ్యానించిన ఆయన అవేం పెద్ద విషయాలు కాదన్నారు. ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన టీవీ చర్చలో తడబడిన బైడెన్.. వాషింగ్టన్‌లో జరిగిన నాటో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కూడా తన పొరపాట్లను కొనసాగించారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అనబోయి ట్రంప్ అన్నారు. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని పుతిన్ అంటూ పరిచయం చేశారు. 81 ఏళ్ల వయసులో బైడెన్ మానసిక సామర్థ్యం సన్నగిల్లుతోందని విమర్శలు వస్తోన్న తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాను రేసు నుంచి వైదొలగనని, ట్రంప్ ప్రమాదకర ముప్పు అని తాజా ఎన్నికల ర్యాలీలో అమెరికన్ పౌరులను బైడెన్ హెచ్చరించారు.
Latestnews, Telugunews, Washington, joe Biden, Keir Starmer…