Nsnnews// త్వరలో నియోజకవర్గానికి మూడున్నర వేల ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని.. అటవీశాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. MPరఘునందన్ రావు, మాజీ మంత్రి హరీశ్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు చేపలు పట్టుకునే అవకాశం కల్పించాలని మెదక్ ఎంపీ రఘునందన్ కోరగా.. స్పందించిన మంత్రి మత్స్య సొసైటీలో సభ్యత్వం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఏ ప్రభుత్వ శాఖలోనైనా అధికారులు తప్పులు చేస్తే…తక్షణం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. రుణమాఫీ కానీ రైతులకు.. ఎప్పటిలోగా పూర్తిచేస్తారని ప్రశ్నించిన మాజీమంత్రి హరీశ్ రావు.. విధివిధానాలను మార్చాలని మంత్రిని కోరారు.
Latest news,Telugu news,Telangana news,Siddipet news