Nsnnews// ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను…సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని పలు గ్రామాల్లో.. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాల అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో నిలిచిపోయిన కాలువల పనులు పూర్తి చేసి, మల్లన్న సాగర్ నీళ్లను పంటపొలాలకు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని…రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పంట నష్టపోయిన రైతులకు..ప్రభుత్వం నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. రైతు బంధు, రుణమాఫీ, బీమా పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసి, ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. ధాన్యం విక్రయించేందుకు వచ్చిన రైతులతో మాట్లాడిన కొత్త ప్రభాకర్… వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
Latest news, Telugunews, Telangana news, Siddipet news