Home పాలిటిక్స్ తగ్గించిన ధరలకే..రైతు బజార్లలో కందిపప్పు, బియ్యం || At reduced prices..Kandippu and rice in farmer’s markets…

తగ్గించిన ధరలకే..రైతు బజార్లలో కందిపప్పు, బియ్యం || At reduced prices..Kandippu and rice in farmer’s markets…

0
తగ్గించిన ధరలకే..రైతు బజార్లలో కందిపప్పు, బియ్యం || At reduced prices..Kandippu and rice in farmer’s markets…

Nsnnews//AP విజయవాడ: నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను తగ్గించి గురువారం నుంచి రైతు బజార్లలో విక్రయిస్తారని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. విజయవాడలోని సివిల్ సప్లైస్ కమిషనర్ కార్యాలయంలో హోల్ సేల్ వర్తకులు, మిల్లర్లు, సరఫరాదారులతో ఆయన సమావేశమయ్యారు. ధరల స్థిరీకరణ, నియంత్రణలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో నిత్యావసర సరకులను ప్రజలకు అందుబాటు ధరల్లో అందించడం వలన… వారికి ఉపశమనం కలిగించడం అవసరమని మంత్రి తెలిపారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.181 ఉన్న కందిపప్పు రూ.160, బియ్యం రూ.52.40 ఉంటే… స్టీమ్డ్ బియ్యం రూ.55.85 ఉంటే రూ.49 చొప్పున విక్రయించనున్నారు. రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం తగ్గించిన ధరలకు విక్రయించాలని నిర్ణయించారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు.

Latestnews, Telugunews, Vijaywada, Nadendla Manohar…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here