Nsnnews// ఐదు నెలల తరువాత ఎట్టకేలకు యోగేశ్ చంద్రపాల్ అనే వైద్యుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన విష్ణుస్వరూప్ సాహిని 1,600 కిలోమీటర్ల మేర జల్లెడ పట్టి, భారత్-నేపాల్ సరిహద్దు వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గత ఐదు నెలలుగా పోలీసుల తప్పించుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో ఎనిమిది మొబైల్ ఫోన్లు, ఇరవై సిమ్ కార్డులు మార్చి, ఆరు ఫేక్ పేర్లతో రహస్యంగా సంచరించినట్లు పోలీసులు తెలిపారు. ముందుగా అరెస్ట్ అయిన ముగ్గురు వ్యక్తుల నుండి వచ్చిన కీలక సమాచారం ఆధారంగా, పోలీసులు విష్ణుస్వరూప్ సాహిని ట్రాక్ చేసి పట్టుకున్నారు.
Latest news, Telugu news, Crime news..