Nsnnews// భారత విజ్ఞాన పరిశోధనా సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో రూపొందించిన డ్రైవర్ లేకుండా నడిచే కారు అద్భుతంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు ప్రశంసించారు. సిలికాన్ వ్యాలీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు తను కూడా డ్రైవర్ లెస్ వెహికిల్లో ప్రయాణం చేశామని, అక్కడి కంటే అద్భుతమైన అనుభూతి కలిగిందనిమంత్రి పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ క్యాంపస్లో డ్రైవర్ లెస్ వెహికిల్లో మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఐఐటీ డైరెక్టర్ మూర్తి ప్రయాణించారు. అంతకుముందు ఐఐటీ పరిశోధన సంస్థ పని తీరు గురించి మంత్రి శ్రీధర్ బాబు డైరెక్టర్ మూర్తిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఐఐటీ హైదరాబాద్ రూపొందించిన ఈ టెక్నాలజీ మన దేశానికి గర్వకారణంగా పేర్కొన్నారు. ప్రయోగ దశలో ఉన్న ఈ టెక్నాలజీ త్వరలోనే ఆచరణలోకి రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ టెక్నాలజీకి సంబంధించిన విషయాలను తమ సహచరులతో మాట్లాడి, అన్ని ప్రభుత్వ విభాగాల్లో వినియోగించుకునే విధంగా చూస్తామన్నారు. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను అన్ని రంగాల్లో ఉపయోగించుకుంటామని మంత్రి వెల్లడించారు.
Latest news,Telugu news,Telangana news