Nsnnews// అల్లారుముద్దుగా పెంచుకున్న తమ ఐదేండ్ల కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. తల్లిదండ్రుల రోదనలను ఆపడం ఎవరీతరం కాలేదు. ఈ హృదయవిదారక దృశ్యాలు ప్రతీఒక్కరి గుండెల్ని మెలిపెట్టాయి. వార్త కవరేజ్‌కు వెళ్లిన జర్నలిస్ట్‌లతో సహా ప్రతొక్కరు కన్నీటి పర్యంతమయ్యారు.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన రాజు-రజిత దంపతులకు ఆయాన్ష్ అనే ఐదేండ్ల కుమారుడు ఉన్నారు. ఆయాన్ష్‌కు ఈనెల 19న జ్వరం రావడంతో సిద్దిపేటలోని అశ్వత్ పిల్లల ఆస్పత్రి తీసుకొచ్చారు. పరీక్షించిన డాక్టర్ మందులు రాసి ఇంటికి పంపించారు. అయినా కూడా జ్వరం తగ్గకపోవడంతో ఈనెల 22న మరోసారి బాబును ఆస్పత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. పరీక్షలు చేసిన తర్వాత బాబుకు డెంగ్యూ జ్వరం వచ్చింది. వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్ కావాలని డాక్టర్ సూచించాడు. డాక్టర్ మనోహర్ సూచనతో ఆయాన్ష్‌ను ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు పేరెంట్స్. తెల్లారి ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ నర్సు బాలునికి ఇంజక్షన్ ఇచ్చింది. దీంతో అయాన్ష్‌కు తీవ్రమైన చలిజ్వరం వచ్చింది. ఆందోళనకు గురైన డాక్టర్ కాసేపు ట్రీట్మెంట్ ఆపారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం రిచ్ చిల్డ్రన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు. బాలుడి మృతిపై కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. వైద్యుడి నిర్లక్ష్యం వల్లే తమ కొడుకు చనిపోయాడని కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. బాలుడి మృతికి కారణమైన డాక్టర్ మనోహర్‌ను శిక్షించి తమకు న్యాయం చేయాలని రోదించారు. ఆయాన్ష్ మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుని కుటుంబసభ్యలను సముదాయించారు.
Latest news,Telugu news,Telangana news,Siddipet news