Nsnnews// భారత్ పై అక్కసు వెళ్లగక్కుతున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు…. సొంత పార్టీలోనే నిరసన సెగ తగులుతోంది. ట్రూడో నేతృత్వం వహిస్తున్న ‘లిబరల్ పార్టీ’కి ఆయన రాజీనామా చేయాలని ఆ పార్టీకి చెందిన ఎంపీ సియాన్ కాసే డిమాండ్ చేశారు. ప్రజలు ఇప్పటికే ఆయన్ను చాలా భరించారని వ్యాఖ్యానించారు. మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఎంపీ సియాన్ ట్రూడో వైదొలగాల్సిన సమయం ఆసన్నమైందనే వాదనతో ఏకీభవిస్తున్నానని చెప్పారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో లిబరల్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కెనడియన్లతో పాటు సొంతపార్టీలో అసంతృప్తిని ఎదుర్కొంటున్న ట్రూడో..పార్టీ నాయకత్వం నుంచి వైదొలగాలనే వాదన పెరుగుతోంది. ఎంపీ కాసే వాదనతో..మరో ఎంపీ ఆంథోనీ హౌస్ ఫాదర్ ఏకీభవించారు. లిబరల్ పార్టీకి ట్రూడో నేతృత్వం వహించడం లేదా వైదొలగడంపై చర్చ జరగాలన్నారు.
Latest news,Telugu news,International news