Home తెలంగాణ ట్యాంక్ బండ్‌పై బతుకమ్మ సంబరాలకు ఏర్పాట్లు || Arrangements for Bathukamma celebrations on Tank Bund

ట్యాంక్ బండ్‌పై బతుకమ్మ సంబరాలకు ఏర్పాట్లు || Arrangements for Bathukamma celebrations on Tank Bund

0
ట్యాంక్ బండ్‌పై బతుకమ్మ సంబరాలకు ఏర్పాట్లు || Arrangements for Bathukamma celebrations on Tank Bund

 

Nsnnews// హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌ వద్ద జరిగే సద్దుల బతుకమ్మ వేడుకల్లో.. దాదాపు 10 వేల మంది మహిళలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు సీఎస్‌ శాంతికుమారి.

సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎస్‌ శాంతికుమారి.. వివిధ శాఖల కార్యదర్శులు, పోలీస్ అధికారులతో వేడుకల ఏర్పాట్లపై చర్చించారు. బతుకమ్మ వేడుకలకు మహిళలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉండడంతో… ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ట్యాంక్ బండ్‌ చిల్డ్రన్‌ పార్క్‌లో ఉన్న బతుకమ్మ ఘాట్‌తోపాటు… నెక్లెస్ రోడ్డులో బతుకమ్మల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఉత్సవాల నేపథ్యంలో… ట్రాఫిక్ డైవర్షన్, బారికేడింగ్‌ ఏర్పాట్లపై పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రతీ శాఖ.. ఒక సీనియర్ అధికారిని ప్రత్యేకంగా నియమించి ఏర్పాట్లను పర్యవేక్షించాలన్నారు సీఎస్ శాంతికుమారి.

ఇక రేపు సాయంత్రం నాలుగు గంటలకు అమరవీరుల స్మారక కేంద్రం నుండి వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా ట్యాంక్‌బండ్ పైకి చేరుకుంటారన్నారు సీఎస్. వారితోపాటు వందలాది మంది కళాకారులు వివిధ కళారూపాలతో ర్యాలీగా వస్తారని తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై జరిగే బతుకమ్మ ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు. బుద్ధ విగ్రహం, సంజీవయ్య పార్క్‌ నుండి ప్రత్యేకంగా… బాణాసంచా కాల్చే కార్యక్రమం, లేజర్ షో ఉంటుందని వెల్లడించారు. ఇక.. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా.. పండుగ శోభ సంతరించుకునేలా ఇప్పటికే హైదరాబాద్‌లోని 150 ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను ఏర్పాటు చేయడంతోపాటు.. జంక్షన్లను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. అలాగే.. ప్రధాన కార్యాలయాలను కూడా విద్యుత్ దీపాలతో అలంకరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

Latest news,Telugu news,Telangana news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version