Nsnnews// తిరుపతి: టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి రాజీనామాను ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. ఆయన రాజీనామాను ఆమోదిస్తూ దేవాదాయ శాఖ కార్యదర్శి కరికాల వలవన్ ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది ఆగస్టులో టీటీడీ ఛైర్మన్‌గా కరుణాకర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. కాగా 2004 నుండి 2006 వరకు ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు భూమన తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌గా పనిచేశారు. 2006 నుంచి 2008 వరకు టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన ఆయన ,2023లో మరోసారి టీటీడీ చైర్మన్‌గా నియమితులయ్యారు.
Latestnews, Telugunews, AP Politics, Thirupathi, TDP, Karnakar reddy…