Nsnnews// ప్రైమరీ స్కూల్ టీచర్ల బదిలీ నిలిపివేయాలంటూ సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట-భూంపల్లి మండలంలోని చిట్టాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థులు ఆందోళన చేపట్టారు. చిట్టాపూర్ రహదారిపై గ్రామ మాజీ సర్పంచ్ రాజయ్య, ఆయా పార్టీల నాయకులు, గ్రామస్తులు, యువజన సంఘాలు ధర్నాకు దిగారు. నెలరోజుల క్రితం బదిలీపై వచ్చిన భాగ్యలక్ష్మి అనే టీచర్‌ను డిప్యూటేషన్ పేరుతో వేరే గ్రామానికి పంపడం సరికాదన్నారు. DEO, MEO ఇచ్చిన ఆర్డర్ కాపీని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో రోడ్డుపై భైఠాయించారు. భూంపల్లి పోలీసులు విద్యార్థులను సముదాయించి రాస్తారోకోను విరమింపజేశారు.
Latest news,Telugu news,Telangana news,Siddipet news